sivaprasad: బీజేపీ వాళ్లతో వేగలేం.. అందుకే బయటకు వచ్చేశాం: ఎంపీ శివప్రసాద్

  • రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది
  • అన్నీ చేస్తామని చెప్పి... ఏదీ చేయలేదు
  • ఆ పార్టీతో వేగలేం
ఏపీకి సరైన రాజధాని, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు ఏమీ లేవని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విడదీసి, కట్టుబట్టలతో బయటకు పంపేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉందని... ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందని చెప్పారు. అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పిన బీజేపీ... చివరకు ఏమీ ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఇక వాళ్లతో వేగలేమని... అందుకే బయటకు వచ్చేశామని ఆయన అన్నారు.

ఈరోజు కూడా టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. మరో టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, ఏపీలో నెలకొన్న పరిస్థితులకు బీజేపీనే కారణమని అన్నారు. రాష్ట్ర సమస్యలను బీజేపీ పరిష్కరించి ఉంటే... తాము మిత్రపక్షంగానే కొనసాగేవారమని చెప్పారు. ఓవైపు సమస్యలపై పోరాడుతూ, మరోవైపు మిత్రపక్షంగా ఉండలేమని... అందుకే బయటకు వచ్చేశామని అన్నారు.
sivaprasad
Telugudesam
mp
BJP

More Telugu News