ap budget: ఏపీకి బీజేపీ సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఇదే: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

  • డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామని టీడీపీ చెప్పుకుంటుంది
  • అందుకే కేంద్రం సాయం చేయడం లేదు
  • అన్నా క్యాంటీన్లకు నిధులు కేటాయించడం ఎన్నికల స్టంటే

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నేతలు పెదవి విరిచారు. గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై ఏ ఒక్క వర్గానికి కూడా ఆసక్తి లేదని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ లో కేవలం అంకెల గారడీ మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి బడ్జెట్ లో కనిపించదని విమర్శించారు. ప్రతి బడ్జెట్ లో కూడా రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతారని... డబుల్ డిజిట్ గ్రోత్ ను సాధించామని అంటారని... అందుకే, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదని అన్నారు.

ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేరకపోవడానికి, ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీనే కారణమని విమర్శించారు. వ్యవసాయరంగం ఏకంగా 40 శాతం ఎలా అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో కేవలం రూ. 12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పారు. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే అన్న క్యాంటీన్లకు రూ. 200 కోట్లు కేటాయించారని మండిపడ్డారు. అమరావతిలో ఇంత వరకు ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు.

  • Loading...

More Telugu News