dhanush: ధనుష్ మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేసింది!

  • ధనుష్ హీరోగా 'వడ చెన్నై'
  • దర్శకుడిగా వెట్రి మారన్ 
  • రౌడీయిజం నేపథ్యంగా సాగే కథ

తమిళంలో స్టార్ హీరోల జాబితాలో ధనుష్ కనిపిస్తాడు. ఆయన నటనలో సహజత్వమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అంటారు. ఆయన క్రేజ్ ను పెంచిన చిత్రాల్లో 'కాకా ముట్టై' .. 'విసారణై' ముందువరుసలో కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది వెట్రి మారన్. ఆయన దర్శకత్వంలోనే ధనుష్ మరో సినిమా చేస్తున్నాడు .. దాని పేరే 'వడ చెన్నై'.

  రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే చెన్నై ఉత్తర ప్రాంతంలోని ఒక ప్రదేశం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో ధనుష్ రౌడీ పాత్రలో కనిపించనున్నాడు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. చేతులకు బేడీలతో పోలీస్ వ్యాన్ దిగుతూ ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసినట్టుగా సమాచారం.      

More Telugu News