mumbai suburban rail: ముంబైలో లోకల్ రైళ్లను నడపడం వల్ల రూ.4,000 కోట్ల నష్టం

  • పార్లమెంటుకు తెలియజేసిన కేంద్రం
  • అయినా ముంబై సబర్బన్ రైళ్ల విస్తరణకు రూ.11,000 కోట్ల నిధులు
  • కొన్ని ప్రాంతాల పట్ల కేంద్రం మమకారానికి ఇదే నిదర్శనం

ముంబై సబర్బన్ రైళ్లతో రైల్వే శాఖ భారీ నష్టాలను చవిచూస్తోంది. మూడేళ్లలో ఏకంగా రూ.4,000 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సర్కారు పార్లమెంటుకు తెలియజేసింది. ఇంత నష్టం వస్తున్నప్పటికీ కేంద్ర సర్కారు బడ్జెట్ లో ముంబై సబర్బన్ రైలు నెట్ వర్క్ కు భారీగా నిధులు కేటాయించడం గమనార్హం.

కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ ఏ ఒక్క ప్రాజెక్టుకూ కూడా పెద్దగా నిధులు కేటాయించింది లేదు. పైగా విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తామని హామీ ఇచ్చి ఆర్థికంగా లాభదాయకం కాదంటూ ఇవ్వకుండా మొహం చాటేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాదికి, దక్షిణాది ప్రాంతాలకు మధ్య కేంద్రం వివక్షను ఇది ఎండగడుతోంది.

లోక్ సభలో ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాన్ గోహన్ లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ... 2014-17 మధ్య రైల్వే శాఖ ముంబై సబర్బన్ రైళ్ల నిర్వహణపై రూ.4,280 కోట్లను నష్టపోయినట్టు చెప్పారు. 2018 కేంద్ర బడ్జెట్ లో ముంబై సబర్బన్ ట్రెయిన్ నెట్ వర్క్ ను రూ.11,000 కోట్లతో విస్తరించనున్నట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంతేకాదు, ముంబై నగర రవాణా వ్యవస్థకు అదనంగా రూ.40,000 కోట్లను కేటాయించే ప్రణాళికతోనూ ఉన్నట్టు చెప్పారు. ముంబై సబర్బన్ రైలు నెట్ వర్క్ ప్రతి రోజూ 2,343 రైళ్ల సర్వీసులను నడుపుతూ 75 లక్షల మందిని చేరవేస్తోంది.

  • Loading...

More Telugu News