kerala: మోదీ హెచ్చరించినా వినలేదు... కేరళలో గాంధీ విగ్రహం, తమిళనాట అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం

  • ఆగని విగ్రహాల విధ్వంసం
  • కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మోదీ
  • అయినా వినని ఆందోళనకారులు

విగ్రహాల విధ్వంసం లెనిన్, పెరియార్ రామస్వామిలతో మొదలై ఇప్పుడు మహాత్మా గాంధీ, అంబేద్కర్ వరకూ చేరింది. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత వామపక్ష నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చేయడం, ఆపై తమిళనాట బీజేపీ కార్యదర్శి హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలు, పెరియార్ రామస్వామి విగ్రహానికి అవమానం, కోల్ కతాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహ ధ్వంసం తదితరాలపై ప్రధాని నరేంద్ర మోదీ, స్వయంగా హోం శాఖతో మాట్లాడి హెచ్చరికలు జారీ చేసినా, విగ్రహాల విధ్వంసానికి పులుస్టాప్ పడలేదు.

తాజాగా ఈ ఉదయం కేరళలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరంబ తాలూకా కార్యాలయంలో ఉదయం 7 గంటల సమయంలో ఈ పని జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తిరుఒట్టియూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించిన తరువాత కూడా ఈ ఘటనలు జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News