raviteja: రవితేజకు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్

  • రంగంలోకి దిగిన శ్రీను వైట్ల 
  • టైటిల్ గా 'అమర్ అక్బర్ ఆంటోని'  
  • కీలకమైన పాత్రలో సునీల్

రవితేజ తన మార్క్ వినోదానికి దూరం కాకుండా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయనున్నాడు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఈ రోజున ప్రారంభమైంది.

 రవితేజ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ ను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పటికే 'నా పేరు సూర్య' .. 'శైలజా రెడ్డి అల్లుడు' వంటి మంచి ప్రాజెక్టులు చేస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్ కి, ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ కీలకమైన పాత్రను పోషించనున్న ఈ సినిమా .. యూఎస్ లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు.  

  • Loading...

More Telugu News