Jagan: 'కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లో కలుస్తారా?' అన్న ప్రశ్నకు జగన్ సమాధానం ఇది!

  • వైకాపా వైఖరి చాలా సుస్పష్టం
  • హోదా ఎవరు ఇస్తే వారికి మా మద్దతు
  • ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నా
  • ఏ పార్టీ అయినా తమ వైఖరి ఇంతేనన్న జగన్

ఈ ఉదయం ప్రకాశం జిల్లా సంతరావూరులో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా, కేసీఆర్ నాయకత్వంలో తెరపైకి వచ్చిన థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లో మీరు చేరతారా? అన్న మీడియా ప్రశ్నకు జగన్ సమాధానం ఇస్తూ, "ఒకటేందంటే మన స్టాండ్ వెరీ క్లియర్. చాలా ట్రాన్స్ పరెంట్ గా ఉన్నాం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతిస్తామని ముందే చెప్పాం. బీజేపీ వాళ్లు ఇవ్వకుంటే వాళ్లకు మద్దతిచ్చే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పొజిషన్ లేదని మీరే అంటున్నారు. చూద్దాం, ఏం జరుగుతుందో. ఎవరినీ నమ్మవద్దు. ప్రజలంతా 25కి 25 మంది ఎంపీలను వైకాపాకు ఇవ్వండి. ఎవరు హోదా ఇస్తారో వారికి మద్దతుగా సంతకం పెడతాము. అది ఏ పార్టీ అయినా ఓకే. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, థర్డ్ ఫ్రంట్ అయినా మా వైఖరి ఇదే" అని అన్నారు.

More Telugu News