Chandrababu: టీడీపీ, బీజేపీ బంధం బద్దలు... నిన్న ఒక్కరోజులో జరిగిన పరిణామాలివి!

  • పార్లమెంట్ లో వివిధ పార్టీల ఆందోళన
  • అసెంబ్లీలో చంద్రబాబు అసంతృప్తి
  • హోదా లేదని మరోసారి జైట్లీ స్పష్టం
  • కేంద్రం నుంచి వైదొలగిన ఏపీ మంత్రులు

గడచిన నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిసున్న తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య ఉన్న బంధం బద్దలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఒక్కసారి గమనిస్తే...
* పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి చేస్తున్న నిరసనలను తెలుగుదేశం వైకాపా కొనసాగించాయి.
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎంపీలు గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు.
* ఆపై 11 గంటలకు లోక్ సభ ప్రారంభంకాగా, వివిధ పార్టీల ఎంపీల ఆందోళనతో నిమిషాల్లోనే వాయిదా పడింది
* ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జరుగగా పోలీసుల లాఠీచార్జ్ తో ఉద్రిక్త పరిస్థితి.
* ఏపీకి హోదా ప్రకటించే ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ వెల్లడి
* ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర వైఖరిపై గట్టిగా నిలదీత, కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఇక భరించే ఓపిక లేదని హెచ్చరిక
* ఆపై సాయంత్రం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా లేదని, ప్యాకేజీకి కట్టుబడి ఉంటామని ప్రకటన. అది కూడా గతంలో ఇచ్చిన దానికి లెక్కలు చెప్పిన తరువాతనేనని వెల్లడి
* జైట్లీ సమావేశం తరువాత ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్. కేంద్రం నుంచి వైదొలిగే విషయంలో ఏకాభిప్రాయం.
* ఆపై మంత్రులు, ముఖ్య నేతలతో మాట్లాడిన చంద్రబాబు. అందరిదీ ఒకే మాట.
* సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజుతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న ఇద్దరు కేంద్ర మంత్రులు.
* రాత్రి 10.30 గంటలకు చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్. మంత్రుల రాజీనామాలపై ప్రకటన.
* రాత్రి 11 గంటలకు బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్... ఏపీలో తమ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాలు చేస్తారని ప్రకటించిన విష్ణుకుమార్ రాజు.

  • Loading...

More Telugu News