Sachin Tendulkar: మై బ్యాటింగ్ హీరో కు పుట్టినరోజు శుభాకాంక్షలు : సచిన్ టెండూల్కర్

  • రిచర్డ్స్ తో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన సచిన్
  • రిచర్డ్స్ చేతిలో గిటారు .. సచిన్ చేతిలో బ్యాట్
  • నవ్వులు చిందిస్తున్న క్రికెట్ దిగ్గజాలు

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కు లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశాడు. ‘మై బ్యాటింగ్ హీరో వివియన్ రిచర్డ్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రిచర్డ్స్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను సచిన్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రిచర్డ్స్  గిటార్ వాయిస్తుండగా, పక్కనే ఉన్న సచిన్ చేతిలో క్రికెట్ బ్యాట్ ఉంది. వీళ్లిద్దరూ నవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిస్తుండటం గమనార్హం. ఈ పోస్ట్ పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు లెజెండ్ క్రీడాకారులు మళ్లీ క్రికెట్ ఆడితే బాగుంటుందని, కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ఓ అభిమాని కోరుకున్నాడు.

More Telugu News