Special Category Status: ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు: తేల్చి చెప్పిన అరుణ్ జైట్లీ

  • జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుంది
  • తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారు
  • ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోంది
  • తర్వాత కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే అంశం మనుగడలో లేదు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని జైట్లీ అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు.

కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే విధానమే మనుగడలో లేకుండా పోయిందని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని, ఆ సమయంలో ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చాలని విభజన చట్టంలో ఉందని అన్నారు. ఏపీకి సాయం చేస్తామని, ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.  

నిధుల విషయంలో ప్రజల సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని జైట్లీ అన్నారు. ప్రతి రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు హక్కుదారేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు కానీ దాని వల్ల వచ్చే ప్రయోజనాలను మాత్రం ఇస్తున్నామని అన్నారు. తాము ఇస్తామన్న దానితో పోల్చితే ఏపీకి ప్రత్యేక హోదా వల్ల వచ్చేది తక్కువగా ఉంటుందని అన్నారు. పోలవరానికి ఇప్పటికే రూ.5000 కోట్లు ఇచ్చామని చెప్పారు. కాగా, రెవెన్యూ లోటు కింద ఇప్పటికి తాము రూ.4000 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.138 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంకా అవసరమైన నిధులు చెల్లిస్తామని జైట్లీ తెలిపారు. 

  • Loading...

More Telugu News