vhp: తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా

  • కారును ఢీ కొన్న ట్రక్ 
  • గుజ‌రాత్‌లోని సూరత్‌ స‌మీపంలో ఘటన
  • కారు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి ఆయన సురక్షితంగా బయటపడ్డారన్న అధికారులు 
  • ప్రమాదంపై ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు
విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రయాణిస్తోన్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రవీణ్ తొగాడియాకు ఎటువంటి గాయాలు కాలేదు. గుజ‌రాత్‌లోని సూరత్‌ స‌మీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తోన్న కారు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి ఆయన సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రవీణ్ తొగాడియా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను హతమార్చేందుకు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపణలు చేశారు. తనకు జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ పోలీసులు తన కోసం ఎస్కార్ట్ టీమ్‌ను సైతం కేటాయించలేదని అన్నారు. తాను ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కాకపోయినట్లయితే సెక్యూరిటీ సిబ్బందితో పాటు అందరం ప్రాణాలు కోల్పోయే వారమని అన్నారు. ఇటీవలే ఆయన తనను పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారేమోనని వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. 
vhp
praveen thogadia
Gujarath

More Telugu News