Priya Prakash Warrior: ఉత్పత్తుల ప్రచారానికి ప్రియా ప్రకాశ్‌కి భారీ మొత్తంలో కంపెనీల ఆఫర్లు..!

  • ప్రియా క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు కంపెనీల క్యూ
  • ఉత్పత్తుల ప్రచారానికి ఒక్కో పోస్టుకు 8 లక్షలిస్తామంటూ ఆఫర్లు
  • 5.8 మిలియన్లను దాటిన ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య
'ఒరు అదార్ లవ్' చిత్రంలోని కనుగీటు సీన్‌తో ఓవర్‌నైట్‌లో క్రేజ్ సంపాదించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కి బాలీవుడ్‌ నుంచే కాక దక్షిణాది సినీ రంగాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు ఈ మధ్య వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు కొన్ని కంపెనీలు సైతం క్యూ గడుతున్నట్లు సమాచారం.

తమ ఉత్పత్తులకు ప్రచారం చేసిపెట్టాలని, ఇందుకు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పుతామని ఆమెకు ఆఫర్ ఇస్తున్నాయట. ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే రూ.8 లక్షల వరకు ఇస్తామంటూ ఆమెకు పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రియా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అతి తక్కువ సమయంలోనే 5.8 మిలియన్లను దాటేసింది.
Priya Prakash Warrior
Oru Adhar love
Instagram

More Telugu News