Kamineni Srinivas: రాజీనామాపై పార్టీ అధిష్ఠానం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు : ఏపీ మంత్రి కామినేని

  • రాజీనామా వార్తలను ఖండించిన కామినేని
  • అధిష్ఠానం ఆదేశిస్తే  రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం
  • స్పష్టం చేసిన మంత్రి కామినేని

ఏపీ బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తారనే వార్తలను మంత్రి కామినేని శ్రీనివాసరావు ఖండించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, బీజేపీ అధిష్ఠానం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాగా, టీడీపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ ఈ రోజు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. 

More Telugu News