Virtual Print Fee (VPF): సినీప్రియులకు గుడ్‌న్యూస్.....రేపటి నుంచి యథావిధిగా సినిమాల ప్రదర్శన

  • వీపీఎఫ్ ఛార్జీల తగ్గింపుకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల అంగీకారం
  • సమ్మె విరమణ...రేపటి నుంచి ప్రదర్శనల పునరుద్ధరణ
  • ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు

వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) ఛార్జీలు, కట్ ఆఫ్ టైమ్ తగ్గింపు విషయంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్‌పీ), దక్షిణాది సినీ నిర్మాతలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఇరు వర్గాల మధ్య ఈ రోజు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఛార్జీల విషయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్‌సీసీ) ఐక్య కార్యాచరణ సమితి (జాక్)-డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది.

 డిజిటల్ ప్రొజక్షన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వీపీఎఫ్‌ను తగ్గించేందుకు డీఎస్‌పీలు అంగీకరించాయి. ఫలితంగా నిర్మాతల జాక్, ప్రదర్శనకారులు తమ సమ్మెను విరమించుకునేందుకు నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి సినిమాలు యథావిధిగా ప్రదర్శితమవుతాయి. కాగా, ఏప్రిల్ 6 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. వారం రోజుల బంద్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1700 థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News