actor jitendra: నటుడు జితేంద్రపై లైంగిక ఆరోపణలు... పోలీసు కేసు నమోదు

  • సిమ్లాలో ఓ హోటల్లో యువతిపై లైంగిక దాడి
  • పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అందిన ఫిర్యాదు
  • చోటా సిమ్లా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్
పాతతరం నటుడు జితేంద్రపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది. ఇది 47 ఏళ్ల క్రితం జరిగిన ఘటన. 1971లో సిమ్లాలో ఓ హోటల్ గదిలో తనపై జితేంద్ర లైంగిక దాడి చేసినట్టు ఓ బాధితురాలి నుంచి అందిన ఈ మెయిల్ ఫిర్యాదు ఆధారంగా చోటా సిమ్లా పోలీసు స్టేషన్ లో సెక్షన్ 354 ఐపీసీ కింద కేసు నమోదైంది.

 బాధితురాలి ఆరోపణ ప్రకారం ఈ ఘటన జరిగినప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. జితేంద్ర అప్పుడు 28 ఏళ్ల వయసులో ఉన్నారు. జితేంద్రతో కలసి బాధితురాలు ఢిల్లీ నుంచి ఓ రోజు రాత్రి సిమ్లా చేరుకుని ఓ హోటల్ లో బస చేశారు. ఆ రాత్రి జితేంద్ర బాగా తాగిన స్థితిలో గదికి తిరిగొచ్చి వేర్వేరుగా ఉన్న రెండు మంచాలను దగ్గరకు జరిపి లైంగిక దాడి చేసినట్టు ఆమె ఆరోపణ. అయితే, ఇవన్నీ ఆధారాల్లేని అరోపణలుగా జితేంద్ర తరఫు న్యాయవాది కొట్టిపడేశారు.
actor jitendra
fir

More Telugu News