Anasuya Bharadwaj: సోషల్ మీడియాకు దూరమైన హాట్ యాంకర్ అనసూయ!
- తనపై ట్విట్టర్‌లో విమర్శలకు మనస్తాపం
- ఇలాగైతే ఎలాగంటూ సన్నిహితుల సూచన
- మరికొంత సమయం కావాలని వెల్లడి
బుల్లితెరపై 'జబర్దస్త్' షోతో విశేష అభిమానులను సొంతం చేసుకున్న హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ ఆమె తళుక్కుమంటోంది. సాధారణంగా సినిమా పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేది. ఎప్పటికప్పుడు తన షోలు, సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉండేది.
కానీ, కొంతకాలంగా ఆమె సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటోంది. 'ఇలా ఉంటే...ఫ్యాన్ బేస్ తగ్గిపోతుంది...నిన్ను మరిచిపోతారు' అంటూ తన సన్నిహితులు కొందరు చెప్పినా సరే ఇప్పట్లో 'సోషల్'గా వ్యవహరించే ఆలోచనలో లేనని తెగేసి చెబుతోందట అనసూయ. తిరిగి సోషల్ మీడియాలో చురుగ్గా మెరవాలంటే తనకు మరికొంత సమయం కావాలంటోందట. ఆమె కఠిన నిర్ణయానికి కారణం...ఆ మధ్య ఓ అభిమాని మొబైల్‌ను పగలగొట్టిందంటూ ట్విట్టర్‌లో తనపై కఠినమైన ట్వీట్లు రావడంతోనే అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం. ఏదేమైనా సినిమాల్లో ఉంటూ ఇలాంటి సంఘటనలను లైట్‌గా తీసుకుని ముందుకు వెళ్లకపోతే ఎలాగని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.