Asaduddin Owaisi: శ్రీ శ్రీ రవిశంకర్ సూచనలపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
- ఆయన రాజ్యాంగం, చట్టాన్ని నమ్మడం లేదు
- తానే ఓ చట్టమని భావిస్తున్నారు
- ఆయన తటస్థ వ్యక్తి కాదంటూ ఒవైసీ విమర్శలు
అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై ముస్లింలు హక్కులు వదులుకోవాలంటూ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ చేసిన సూచనపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘ఆయన (రవిశంకర్) రాజ్యాంగాన్ని నమ్మడం లేదు. చట్టాన్ని విశ్వసించడం లేదు. ఆయన తనే ఒక చట్టమని భావిస్తున్నారు. తాను చాలా పెద్దవాడినని, అందరూ తాను చెప్పేది వినాలని అనుకుంటున్నారు. ఆయన తటస్థవాది కాదు’’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
చాలా కాలంగా అయోధ్య అంశంపై హిందూ, ముస్లింల మధ్య అంగీకారం కోసం శ్రీశ్రీ రవిశంకర్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఉన్నట్టుండి వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం అంగీకరించదని, కనుక అయోధ్యపై హక్కులు వదులుకోవాలంటూ ముస్లింలకు రవిశంకర్ సూచన చేయడం సంచలనం రేపింది.