Punjab National Bank: పీఎన్బీపై నీరవ్ మోదీ దెబ్బకు విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం!

  • పంజాబ్ నేషనల్ బ్యాంకు అంబాసిడర్ గా ఉన్న విరాట్ కోహ్లీ
  • ఎన్నో బ్యాంకు పథకాలకు గతంలో ప్రచారం
  • ప్రచాకర్తగా కాంట్రాక్టు పొడిగింపునకు విముఖత

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిలువునా ముంచి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, బ్యాంకు పరువును నట్టేట ముంచగా, ఆ బ్యాంకు పథకాలకు ప్రచారకర్తగా ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పీఎన్బీతో ఉన్న ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు విరాట్ కోహ్లీ విముఖత వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

ఈ సంవత్సరం చివరి వరకూ పీఎన్బీతో కోహ్లీ డీల్ ఉందని, అప్పటివరకూ మాత్రమే కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతాడని ఆయన బ్రాండ్ వ్యవహారాలను పర్యవేక్షించే కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టెయిన్ మెంట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కోహ్లీ డీల్ ను పొడిగించుకునే విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా ఎటువంటి చర్చలూ జరపలేదని కార్నర్ స్టోన్ సీఈఓ బంటీ సజ్దే వెల్లడించారు. ఈ వ్యవహారంలో పీఎన్బీని తప్పుపట్టేందుకు సరైన కారణం లేదని అంటూనే, కాంట్రాక్టు పొడిగింపునకు కోహ్లీ సుముఖంగా లేరని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News