Nara Lokesh: నారా లోకేష్ తో భేటీ అయిన డెల్లాయిట్ ప్రతినిధులు

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్
  • సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ను ఏర్పాటు చేయాలంటూ డెల్లాయిట్ కు ఆహ్వానం
  • పూర్తి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామన్న సంస్థ ప్రతినిధులు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ తో డెల్లాయిట్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ డెల్లాయిట్ ప్రతినిధులను లోకేష్ కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ వన్ ప్లేస్ లో ఉందని... కేవలం 21 రోజుల వ్యవధిలోనే కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. లోకేష్ ఆహ్వానంపై డెల్లాయిట్ ప్రతినిధులు స్పందిస్తూ, కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తామని... త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News