katherine hadda: యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ను అభినందించిన మోహన్ బాబు.. ఒక లెజెండ్ ను కలవడం సంతోషంగా ఉందన్న కేథరిన్!

  • కేథరిన్ తో భేటీ అయిన మోహన్ బాబు
  • ఆమెతో కలసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటన
  • ఒక లెజెండ్ ను కలవడం సంతోషంగా ఉందన్న కేథరిన్
సినీ రంగంలో బిజీగా ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తనవంతు పాత్రను పోషిస్తుంటారు సినీ నటుడు మోహన్ బాబు. తాజాగా యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహిళల అక్రమ రవాణా విషయంలో అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న కృషిని అభినందించారు. ఆమెతో కలసి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.

మరోవైపు, మోహన్ బాబుతో భేటీ కావడం పట్ల కేథరిన్ సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ లెజెండ్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. స్ఫూర్తి దాయకమైన మీ కథను వివరించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. మీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు. 
katherine hadda
mohan babu
meeting
women trafficking

More Telugu News