vishnu kumar raju: రూ. 10 లక్షలిస్తే నన్ను కూడా చంపేస్తారు: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

  • గూండాలు, రౌడీలకు మాత్రమే టీడీపీలో పదవులు ఇస్తున్నారు
  • హత్యకేసులో నేరస్తుడు.. మోదీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడతారా?
  • ఎమ్మెల్యే వాసుపై చర్యలు తీసుకోవాలి
టీడీపీలో గూండాలు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ. 5 లక్షల కోసం హత్యలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రూ. 10 లక్షలు ఇస్తే తనను కూడా హత్య చేస్తారని అన్నారు. హత్యకేసులో నేరస్తుడైన వ్యక్తి... ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తాడా? అంటూ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి డుమ్మాకొట్టి... నిరసన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
vishnu kumar raju
vasupalli ganesh
Chandrababu
Narendra Modi

More Telugu News