NTR: ఎన్‌టీఆర్ బయోపిక్‌లో శర్వానంద్...?

  • టీనేజ్ ఎన్‌టీఆర్ పాత్రకు పరిశీలనలో శర్వానంద్ పేరు..!
  • ఈ పాత్రకు ఏ ఒక్కరినీ ఎంపిక చేయలేదని సమాచారం
  • బాలకృష్ణ సొంత బ్యానర్‌లో తెరకెక్కనున్న 'ఎన్‌టీఆర్' చిత్రం

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో యువ హీరో శర్వానంద్ నటించనున్నట్లు సమాచారం. ఇందులో టీనేజ్‌ ఎన్‌టీఆర్ పాత్రను అతను పోషించనున్నట్లు తెలిసింది. 'ఎన్‌టీఆర్' పేరుతోనే రూపొందనున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌ చేయనున్నారు. ఎన్‌బీకే స్టూడియోస్ పతాకంపై బాలయ్యే ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. ఇందులో ఎన్‌టీఆర్ జీవితంలోని మూడు దశలను చూపించనున్నారు.

స్కూలు విద్యార్థిగా, టీనేజర్‌గా, 25 ఏళ్ల యువకుడిగా ఎన్‌టీఆర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. 25 ఏళ్ల వయసు దాటినప్పటి ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తారు. అయితే ఇందులో టీనేజ్ ఎన్‌టీఆర్ పాత్ర కోసం టాలీవుడ్‌లోని పలువురు యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నామని, వారిలో శర్వానంద్ కూడా ఒకరని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరినీ ఈ పాత్ర కోసం ఫైనలైజ్ చేయలేదని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో సంబంధమున్న వారు చెబుతున్నారు. విలక్షణమైన చిత్రాలతో దూసుకుపోతోన్న శర్వానంద్‌కే ఈ పాత్ర దక్కవచ్చని పలువురు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News