అత్యంత అరుదైన వ్యాధి నాకు సోకింది: గుండెలను పిండేస్తున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ పోస్ట్!
- విలక్షణ నటనతో సినీ అభిమానులకు దగ్గరైన ఇర్ఫాన్ ఖాన్
- అరుదైన వ్యాధి సోకిందని డాక్టర్లు తేల్చారన్న ఇర్ఫాన్
- కానీ దానికి తలవంచబోనని వెల్లడి
- ఓదార్పు మెసేజ్ లు పెడుతున్న అభిమానులు
కొన్నిసార్లు నిద్రలేవగానే దిగ్భ్రాంతి చెందే విషయాలు వినాల్సి వస్తుందని, కొంతకాలం నుంచి సస్పెన్స్ స్టోరీగా సాగిన తన జీవితంలో పెను మార్పు వచ్చిందని అన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకునే తనకు అటువంటి వ్యాధే సోకిందని, ఈ రోగానికి తలవంచే పరిస్థితి లేదని, పోరాడి తీరుతానని ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు. దీన్నుంచి బయట పడేందుకు తన కుటుంబం, స్నేహితులు మార్గాన్వేషణ చేస్తున్నారని చెప్పాడు. ఇక ఇర్ఫాన్ పోస్టును చూసిన అభిమానులు బాధతో ఓదార్పు మెసేజ్ లు పెడుతున్నారు.