kodi ramakrishna: నిజంగానే అది చిరంజీవి గొప్పతనం: కోడి రామకృష్ణ

  • కొత్త హీరోలా చిరూ కష్టపడ్డారు
  • కొత్త హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చారు 
  • రెండేళ్ల పాటు ఒకటే డ్రెస్ వేసుకున్నారు  

దర్శకులు కోడి రామకృష్ణ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. 'అంజి ' సినిమాను గురించి ప్రస్తావించారు. " 'అమ్మోరు' తరువాత చిరంజీవిగారితో గ్రాఫిక్స్ కూడిన సినిమా చేయనున్నట్టుగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాకు చెప్పారు. దాంతో నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాను. గ్రాఫిక్స్ తో కూడిన సినిమా అంటే ఓ కొత్త ఆర్టిస్టులా మీరు కష్టపడవలసి ఉంటుంది" అని అన్నాను. 'కొత్త ఆర్టిస్టులా ఎంత కష్టమైనా పడటానికి నేను సిద్ధం .. గ్రాఫిక్స్ కి సంబంధించిన సినిమానే చేయండి' అన్నారాయన.

ఈ సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే సీన్ ను నెల రోజుల పాటు చిత్రీకరించాం. ఎంతో ఓపికగా చిరంజీవి గారు చేశారు. అలా చాలా డబ్బు ఖర్చుపెడుతూ ఈ సినిమా చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. క్లైమాక్స్ సీన్ కోసం ఒక డ్రెస్ ను చిరంజీవిగారు రెండు సంవత్సరాలు వేసుకున్నారు. గ్రాఫిక్స్ కి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయన అలాగే ఆ డ్రెస్ తో చేసేవారు. ముందుగా చెప్పినట్టు ఒక కొత్త ఆర్టిస్టు మాదిరిగానే కష్టపడ్డారు. ఇంతటి భారీ సినిమాను కొత్త హీరోయిన్ తో చేయడానికి చిరంజీవి అంగీకరించడం మరో విశేషం .. ఆ సినిమా పూర్తికావడానికి ఆయన గొప్పతనమే కారణం' అని చెప్పుకొచ్చారు.     

More Telugu News