high speed rail: అన్ని ప్రముఖ పట్టణాలకు హై స్పీడ్ రైళ్లు... రూ.10 లక్షల కోట్ల ప్రణాళికను సిద్ధం చేస్తున్న కేంద్రం

  • దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల మేర ఏర్పాటు
  • ఇందుకు రూ.10 లక్షల కోట్ల వ్యయ అంచనాలు
  • ఏప్రిల్ లో ప్రకటించనున్న కేంద్రం

భారీ నిధులతో దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే హౌ స్పీడ్ రైలు రవాణా వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రూ.10 లక్షల కోట్ల అంచనాలతో దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలను కలిపే విధంగా మొత్తం 10,000 కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైలు నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రణాళికను ఏప్రిల్ లో ప్రకటించనున్నట్టు రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏ రూట్లను హై స్పీడ్ నెట్ వర్క్ కింద అభివృద్ధి చేయనున్నదీ అప్పుడే వెల్లడించనున్నట్టు చెప్పారు.

‘‘కొత్తగా ఏర్పాటు చేసే లైన్లపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణం చేయగలవు. ఒకే పిల్లర్ పై రెండు లైన్లను వేయడం వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటర్ కు రూ.200 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గుతుంది. అలాగే, తక్కువ బరువు ఉండే అల్యూమినియం కోచ్ లను తయారు చేయనున్నాం’’ అని  ఆ అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను ఆర్థిక సంస్థల నుంచి సమీకరించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రైల్వే శాఖ ముంబై-అహ్మదాబాద్ మధ్య జపాన్ ప్రభుత్వ సహకారంతో 534 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ ను అభివృద్ది చేస్తోంది.

  • Loading...

More Telugu News