Balakrishna: ఎన్నో దెబ్బలు తగిలాయి... వాటితో పోలిస్తే ఇదెంత?: ఎమ్మెల్యేలతో బాలకృష్ణ

  • ఇటీవల చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న బాలయ్య
  • చేతికున్న కట్టుతోనే అసెంబ్లీ సమావేశాలకు
  • పరామర్శించిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
ఇటీవల తన చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా గాయం పూర్తిగా మానక పోవడంతో, చేతికున్న కట్టుతోనే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం వెలగపూడికి చేరుకున్నారు. చేతికి బ్యాండేజ్ తో ఉన్న బాలకృష్ణను చూసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పరామర్శించారు.

గాయం ఎప్పుడు మానుతుందని కొందరు ప్రశ్నించగా, తాను ఎన్నో దెబ్బలు తిన్నానని, ఇదేమీ పెద్ద దెబ్బ కాదని, దీన్ని తాను లెక్క చేయడం లేదని తనదైన శైలిలో బాలయ్య సమాధానం ఇచ్చారు. సినిమా షూటింగ్ లలో గాయపడటం సాధారణమేనని, వాటిని గురించి తాను పట్టించుకోనని తెలిపారు. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతికి జలహారతి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు.
Balakrishna
Hindupuram
Operation
Lepakshi
Velagapudi
Assembly

More Telugu News