Auto: ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా 8న హైదరాబాద్‌లో ఆటోల బంద్

  • ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని ఆగ్రహం
  • సీజ్ చేసిన ఆటోలను విడిచిపెట్టాలని డిమాండ్
  • ట్రాఫిక్ పోలీసుల వైఖరికి నిరసనగానేనన్న జేఏసీ కన్వీనర్
ఆటోవాలాలపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ వేధింపులకు నిరసనగా ఈ నెల 8న హైదరాబాద్‌లో ఆటోల బంద్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. హైదర్‌గూడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు సీజ్ చేసిన తన ఆటోను రూ.8,025 జరిమానా కట్టి విడిపించుకునేందుకు అక్బర్ అనే డ్రైవర్ వెస్ట్‌జోన్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లగా టోలీచౌకి ట్రాఫిక్ సీఐ శివ చంద్రబోస్ చలానా రాయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోలపై ఇష్టానుసారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సీజ్ చేసిన ఆటోలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Auto
Drivers
Telangana
Traffic police
Hyderabad

More Telugu News