Amala Home: ఆత్మసౌందర్యాన్ని చాటుకున్న అమలాపాల్...!
- తన కళ్లను దానం చేస్తానని ప్రకటన
- నేత్రదానంపై అవగాహనకు 'అమలా హోమ్' ఏర్పాటు
- చూడటం ప్రతి ఒక్కరి హక్కని వెల్లడి
దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ అమలాపాల్. తనకు పైకి కనిపించే అందమే కాక ఆత్మసౌందర్యం కూడా ఉందని ఆమె చాటుకుంది. కళ్లు లేని వాళ్లకు తన కళ్లను దానం చేస్తానని ఈ మలయాళీ బ్యూటీ ప్రకటించింది. కళ్లులేని వాళ్ల కోసం 'అమలా హోమ్' అనే ఓ సంస్థను కూడా ఆమె ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నేత్రదానంపై అవగాహన కల్పించడంతో పాటు అందుకు అవసరమైన నిధులను సమకూర్చుతుంది.
"అగర్వాల్ ఐ కేర్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కొన్ని నిజాలు నాకు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నట్లు నాకు తెలిసింది. అందులో మూడో వంతు భారత్‌లో ఉన్నారు. అందులో 70 శాతం కేసులు పరిష్కరించగలిగినవే. చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది సాధ్యమయ్యేందుకు అందరూ కృషి చేయాలి" అని అమలాపాల్ కోరింది.