prasar bharti: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖపై ప్రసార భారతి చైర్మన్ మండిపాటు!

  • స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ
  • దాన్ని మోదీ సర్కారు కాపాడుతుందని భావిస్తున్నా
  • ప్రసార భారతి చైర్మన్ సూర్యప్రకాష్

ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ చానళ్ల నిర్వహణ సంస్థ ప్రసార భారతి కేంద్ర సమాచార ప్రసార శాఖ తీరు పట్ల ఆగ్రహంతో ఉంది. ప్రసార భారతి సర్వ స్వతంత్ర సంస్థ కాగా, ఇందులో కేంద్ర ప్రసార శాఖ జోక్యం పట్ల సంస్థ చైర్మన్ సూర్య ప్రకాష్ తీవ్రంగానే స్పందించారు. ప్రసార భారతి, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి స్మృతి ఇరానీ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తుండడంతో సూర్య ప్రకాష్ స్పందిస్తూ... ప్రసార భారతి చట్టం లేదన్నట్టుగా సమచార, ప్రసార శాఖల ఉద్యోగుల పనితీరు ఉందన్నారు.

వార్షిక పనితీరు మదింపు నివేదికపై మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలపైనా ఆయన మండిపడ్డారు. ‘‘ప్రసార భారతి అనేది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. పార్లమెంటు చట్టం కింద ఏర్పాటు చేసినది. స్వతంత్రంగా పనిచేసే పూర్తి అధికారం ఉంది. ఈ చట్టంలో ఏవైనా మార్పులు చేస్తే అది పార్లమెంటు ధిక్కారమే అవుతుంది’’ అని ప్రకాష్ అన్నారు. నరేంద్ర మోదీ సర్కారు ప్రసార భారతి స్వతంత్రను కాపాడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News