Tamannaah: నా జీవితంలో ఆనందం ఎక్కడిది?: హీరోయిన్ తమన్నా

  • సినిమా జీవితంలో సుఖం ఉండదు
  • ఆడంబరాలే తప్ప ఆనందం ఎరుగము
  • కష్టాలున్నా నటించాల్సిందే: తమన్నా
సినిమా తారల జీవితాలు సుఖంగా సాగుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఇక్కడ సుఖ జీవనం అన్నది అపోహేనని, తమ జీవితాలు సమస్యలమయమని చాలా మందికి తెలియదని హీరోయిన్ తమన్నా అభిప్రాయపడింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, తమకు లభించేది ఆడంబరాలతో కూడిన జీవితమే తప్ప ఆనందం ఉండదని అంటోంది. హీరోయిన్లు ఎవరూ సంపూర్ణంగా సంతోషాన్ని అనుభవించడం లేదని, రాత్రింబవళ్లూ షూటింగ్ ల్లో పాల్గొంటూ శ్రమిస్తుంటామని చెప్పింది.

స్పాట్ లో 'రెడీ' అని వినబడగానే వెళ్లి నిలుచోవాలని, మనసులో ఎన్ని కష్టాలున్నా ముఖంపై కనిపించకుండా చూసుకోవాలని, సొంత పనులకు, సొంత మనుషులకు సమయాన్ని కేటాయించాలని ఉన్నా అది కుదరదని వాపోయింది. కనీసం నచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితుల్లో తామున్నామని తమన్నా వెల్లడించింది. మామూలు అమ్మాయిలను చూస్తుంటే తాను కూడా వారిలా ఉండలేకపోయానన్న బాధ కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం పరితపించాల్సి వుంటుందని, దర్శకుడు చెప్పినట్టు నడచుకోవాల్సిందేనని, అందుకే తారల జీవితం అద్దాల మేడని పెద్దలు అంటుంటారని వేదాంతం వేదాంతాలు వల్లించింది.
Tamannaah
Movie Industry
Tollywood

More Telugu News