Mandira Bedi: సాహోలో గ్యాంగ్‌స్టర్‌గా బాలీవుడ్ బ్యూటీ

  • ప్రభాస్ 'సాహో'లో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో మందిర బేడీ
  • తనను పోలీసు లేదా గ్యాంగ్‌స్టర్‌గా మాత్రమే చూడగలరని వ్యాఖ్య
  • పరుగు తనకు ధ్యానం లాంటిందని వెల్లడి

బాలీవుడ్‌లో అటు బుల్లితెరతో పాటు అవకాశమొచ్చినప్పుడల్లా ఇటు వెండితెరపై కూడా వెలుగుతున్న బ్యూటిఫుల్ అండ్ బ్రేవ్ లేడీ మందిరా బేడీ. 45 ఏళ్ల వయసులోనూ ఆమె ఇప్పటికీ ఫిట్‌నెస్‌పై పెట్టే శ్రద్ధ అంతా ఇంతా కాదు. అందుకే తన వయసు పైకి కనపడదు. అసలు విషయానికొస్తే, బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఇందులో ఎక్కువగా బాలీవుడ్ తారాగణాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.

తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, మందిరా బేడీ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించనుందట. ఇందులో ఆమె గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుందని సమాచారం. అభిమానులు, ప్రేక్షకులు తనను పోలీసు లేదా గ్యాంగ్‌స్టర్‌గా మాత్రమే చూడగలరని ఆమె గతంలో సెలవిచ్చిన సంగతి తెలిసిందే. తనకు రన్నింగ్ అంటే చాలా ఇష్టమని, ప్రతి రోజు ఉదయం ఇంటి నుంచి 7 గంటలకు తాను బయటకొస్తే తనతో పాటు చుట్టుపక్కల ఉన్న వారు ఓ 20 మంది వస్తారని చెబుతోంది. తనకు సంబంధించినంత వరకు పరుగు అనేది ధ్యానం లాంటిదని ఆమె చెప్పింది. గతంలో కంటే తాను ఇప్పుడు బలంగానూ ఫిట్‌గానూ ఉన్నానని అంటోంది. మరి ఈ ఫిట్ లేడీ సాహో చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి....

  • Loading...

More Telugu News