Bodra: ప్రముఖ సినీ ఫైనాన్షియర్ బోద్రా కుమార్తె కరిష్మా కిడ్నాప్!

  • దక్షిణాది చిత్రాలకు ఫైనాన్స్ చేసే బోద్రా
  • తన కుమార్తెను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు
  • రజనీకాంత్ భార్యపై గతంలో కోర్టుకెక్కిన బోద్రా
దక్షిణాదిలో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ చిత్రాలకు ఫైనాన్స్ చేసే ప్రముఖుడు బోద్రా కుమార్తె కరిష్మా బోద్రా కిడ్నాప్ నకు గురైంది. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెన్నై, టీ నగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కు బోద్రా ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపారు.

కాగా, యానిమేషన్ చిత్రం 'కొచ్చాడయన్' విషయంలో రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టులో బోద్రా కేసు వేసిన విషయం తెలిసిందే. సినిమా కోసం తన వద్ద నుంచి డబ్బు తీసుకున్న లత, దాన్ని తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ఇప్పుడు బోద్రా కుమార్తె కిడ్నాప్ వ్యవహారం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Bodra
South Cine Industry
Kidnap
Karishma

More Telugu News