Hyderabad: హైదరాబాదులో మందుకొట్టి దొరికిపోయిన మహిళా డాక్టర్... మరో యువతి కూడా!

  • వీకెండ్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • హైదరాబాద్ లో పట్టుబడిన అమ్మాయిలు
  • మొత్తం 99 మందిపై కేసులు నమోదు

అసలే వీకెండ్. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి పబ్ కు వచ్చారు. పూటుగా మందు కొట్టి ఎంజాయ్ చేశారు. కార్లకు డ్రైవర్లు ఉన్నా వారిని ఇళ్లకు పంపేసి, అదే మద్యం మత్తులో కారు నడుపుతూ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపేవారి కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, మొత్తం 99 మందిపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో జరిగిన తనిఖీల్లో ఇద్దరు యువతులు కూడా పట్టుబడ్డారు.

చత్తీస్ గఢ్ కు చెందిన సౌమ్య, హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తోంది. ఓ పబ్బులో జరిగిన పార్టీకి హాజరై, తిరిగి వస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా, రక్తంలో మద్యం ఆనవాళ్లు 88 పాయింట్లుగా కనిపించాయి. ఇదే సమయంలో సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతి కూడా పోలీసులకు చిక్కింది. వీరి వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. ఇక నరేంద్ర వర్మ అనే వ్యక్తి, కనీసం శ్వాస పరీక్ష నిమిత్తం గాలిని ఊదలేనంతగా తాగేసి దొరికిపోయాడు. పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపైనే వర్మ తూలిపడ్డాడు. ఈ తనిఖీల్లో మొత్తం 45 కార్లు, 54 టూ వీలర్ లను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News