Narendra Modi: సికింద్రాబాదులో అడ్రస్ లేకుండా చేస్తాం... మోదీకి ఒవైసీ సవాల్

  • అన్ని విషయాల్లో మోదీ విఫలమయ్యారు
  • దమ్ముంటే పార్లమెంటును రద్దు చేయండి
  • సికింద్రాబాదులో గెలిచి చూపిస్తాం
ప్రతి రంగంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశ ప్రజల ఆశలకు విరుద్ధంగా మోదీ పాలన సాగుతోందని మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అడ్రస్ ను గల్లంతు చేస్తామని... దమ్ముంటే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ మోదీకి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి గుణపాఠం నేర్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడం తప్ప, వారి కోసం మోదీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదని అన్నారు. టీఆర్ఎస్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. 
Narendra Modi
Asaduddin Owaisi

More Telugu News