meghalaya: కాంగ్రెస్ అప్రమత్తం.. హుటాహుటిన మేఘాలయ బయల్దేరిన నేతలు

  • మేఘాలయలో హంగ్
  • అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
  • కీలకంగా మారిన స్వతంత్రులు
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. మొత్తం 59 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో 22 చోట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. దీనికి సరైన మద్దతును కూడగట్టే క్రమంలో ఆ పార్టీ కీలక నేతలు అహ్మద్ పటేల్, కమల్ నాథ్ లు మేఘాలయ బయల్దేరారు. గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులతో వీరు మంతనాలు సాగించనున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సకాలంలో ఇతరుల మద్దతు కూడగట్టలేకపోవడంతో, అధికారానికి దూరమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం మేఘాలయ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. మేఘాలయలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 
meghalaya
assembly elections
results
congress

More Telugu News