chaitu: చైతూ .. సమంతల మూవీ టైటిల్ గా 'ప్రేయసి'?

  • చైతూ హీరోగా శివ నిర్వాణ 
  • సినిమా కథానాయికగా సమంత 
  • నిర్మాతలుగా దానయ్య .. కోన వెంకట్

గతంలో చైతూ .. సమంత 'ఏమాయ చేశావే'.. 'ఆటోనగర్ సూర్య' .. 'మనం' సినిమాలు చేశారు. పెళ్లి తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది దర్శకనిర్మాతలు  ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చైతూ .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ తాజాగా చైతూకి ఒక కథ చెప్పి మెప్పించాడు. అలాగే ఆయన సరసన హీరోయిన్ గా సమంతను ఒప్పించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకి డీవీవీ దానయ్య .. కోన వెంకట్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథాపరంగా ఈ సినిమాకి 'ప్రేయసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.     

  • Loading...

More Telugu News