renu desai: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్!

  • నా కవిత పవన్ ను ఎలా టార్గెట్ చేస్తుందంటూ మండిపాటు
  • నా సోషల్ మీడియాలోకి వచ్చి, ఏదో ఒకటి కామెంట్ చేయవద్దు
  • మీ పని మీరు చూసుకోండి
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మండిపడ్డారు. తాను పోస్ట్ చేసిన ఓ కవిత... పవన్ కల్యాణ్ ను ఎలా టార్గెట్ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీపని మీరు చూసుకోవాలని... తన సోషల్ మీడియాలోకి ఎంటరై, ఎదో ఒకటి పోస్ట్ చేస్తూ, తనను కామెంట్ చేయవద్దని అన్నారు. ఈ ట్వీట్ ను కూడా మీరు రాద్ధాంతం చేస్తారనే విషయం తనకు తెలుసని చెప్పారు.

ఆమె ఇంతగా ఆగ్రహం చెందడానికి కొందరు చేసిన కామెంట్లే కారణం. రేణు దేశాయ్ ను ఉద్దేశించి... మీ వల్లే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. సగం నాలెడ్జ్ తో మీరు ట్వీట్లు చేస్తారని... మీరు ఏదో చెబితే, మీడియా దాన్ని పూర్తిగా హైలైట్ చేస్తోందని విమర్శించారు. దయచేసి తమరి పని తమరు చేసుకోవాలని... పవన్ గురించి ఎలాంటి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరారు. దీంతో, ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.
renu desai
Pawan Kalyan
fans
fire

More Telugu News