Poonam Todi: ఆటో డ్రైవర్ కూతురు... ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్‌లో టాపరు.... సెలబ్రిటీల అభినందనలు!

  • ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాప్
  • పూనంకు టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కంగ్రాట్స్
  • సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభినందనలు
ఉత్తరాఖండ్‌‌లోని డెహ్రాడూన్‌కి చెందిన ఆమె పేరు పూనం తోడి. ఆమె ఓ సాదాసీదా ఆటో డ్రైవర్ కుమార్తె. అయితేనేం పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని ఆమె నిరూపించింది. తన తండ్రి ప్రోత్సాహంతో 2016లో డెహ్రాడూన్‌లో నిర్వహించిన ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్ (పీసీఎస్-జుడీషియల్) పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది. గురువారం విడుదలయిన ఫలితాల్లో తమ కుమార్తె అగ్రస్థానంలో నిలిచిందని తెలియగానే ఆ తల్లిదండ్రుల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి.

ఈ విషయం తెలుసుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. పూనం విజయానికి గర్వపడుతున్నట్లు ట్వీట్ చేశారు. పూనంతో పాటు ఆమె ఆశయ సాధనకు ఆటంకాలు రాకుండా వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన ఆమె తల్లిదండ్రులను కూడా ఆయన మెచ్చుకున్నారు. ఆమె అందరికీ నిజమైన ప్రేరణ అని లక్ష్మణ్ కొనియాడారు. ఆయనతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను 'అభినందన'ల ట్వీట్లతో ముంచెత్తుతున్నారు.
Poonam Todi
VVS Laxman
Provincial Civil Services-judicial

More Telugu News