varma: శ్రీదేవి పాత్రను పోషించే నటి ఎక్కడా లేదు: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

  • శ్రీదేవి జీవిత చరిత్రను తెరకెక్కించడం నిజం కాదు
  • ఆ విధమైన ప్రయత్నం చేయడం మూర్ఖత్వమే అవుతుంది
  • రామ్ గోపాల్ వర్మ ట్వీట్

తన అభిమాన నటి శ్రీదేవిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఈ రోజు వర్మ స్వయంగా ఖండించారు. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో తాజా ట్వీట్ తో ఆ వార్తలకు చెక్ పెట్టారు.

‘‘శ్రీదేవి జీవిత చరిత్రపై నేను ఒక సినిమా తీస్తున్నానంటూ మీడియాలో ఓ వర్గం పేర్కొన్నదంతా అవాస్తవం. ఈ విధమైన ప్రయత్నం చేయడం కూడా మూర్ఖత్వమే అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి పాత్రను పోషించే నటీమణి ఎక్కడా లేదు’’ అని వర్మ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.

More Telugu News