‘ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్’ ఫొటోపై స్పందించిన నటి
- నిన్నటి వరకు నన్ను కవి అని పొగిడారు
- నేడు నీతిమాలిన దానినని అంటున్నారు
- ఫొటోకు పోజిచ్చినందుకు నయా పైసా కూడా తీసుకోలేదు
- విమర్శలపై స్పందించిన నటి గిలూ జోసెఫ్
తన ఫొటోపై దుమారం చెలరేగడంతో గిలు జోసెఫ్ స్పందించింది. ఆ ఫొటోకు పోజిచ్చినందుకు తాను నయా పైసా కూడా తీసుకోలేదని, అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. గ్రాఫిక్ ఫొటోలను చూడడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారని, అటువంటివి చూడడంలో వారికి ఎటువంటి ఇబ్బందీ లేదని, కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించింది. నిన్నటి వరకు తనను గొప్ప కవిగా పొగిడిన వారే నేడు నీతి తప్పిన దానిగా, వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.