Burkina Faso: రక్తమోడిన బుర్కినా ఫాసో.. ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం

  • ఫ్రెంచ్ రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడి
  • ఎదురు కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదుల హతం
  • ఇస్లామిక్ ఉగ్రవాదుల పనేనన్న ప్రభుత్వం

ఆఫ్రికన్ దేశం బుర్కినాఫాసో రాజధాని వాగడుగు రక్తసిక్తమైంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రెంచ్ రాయబార కార్యాలయం, మిలటరీ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 8 మంది మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నా మృతుల సంఖ్య 28కి పైనే ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 80 మందికిపైగా గాయపడ్డారు. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో దాడిలో పాల్గొన్న మొత్తం 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.  

ఇది ఉగ్రదాడేనని బుర్కినాఫాసో ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దేశంలో దాడి చేయడం 2016 నుంచి మూడోసారి. తాజా దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఎంబసీ అధికారులు అంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-వెస్ లీ డ్రియన్ తెలిపారు.

More Telugu News