KTR: కేటీఆర్‌ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

  • తెలంగాణలో పసుపు బోర్డు స్థాపించాలని ఇటీవల కేటీఆర్ లేఖ
  • స్పైసెస్ బోర్డ్ ఆఫీసులో తెలంగాణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం: సురేశ్ ప్రభు 
  • పసుపు కోసం ప్రత్యేకంగా ఒక స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు సహకరిస్తాం

రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని తెలుపుతూ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలంగాణ సర్కారుకి లేఖ పంపి, హామీ ఇచ్చారు.

పసుపు పంట మార్కెటింగ్, రీసెర్చ్ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపైన ఉంటుందని తన లేఖలో తెలిపిన కేంద్ర మంత్రి... స్పైసెస్ బోర్డు ద్వారా పసుపుతో పాటు ఇతర స్పైసెస్ ఎగుమతులు, నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను పర్యవేక్షించేలా చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెల్ ను స్పైసెస్‌ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ (TIES) కింద పసుపు కోసం ప్రత్యేకంగా ఒక స్పైసెస్ పార్క్ కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News