Telangana bhavan: తెలంగాణ భవన్ కు బాంబు బెదిరింపు

  • పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపు
  • అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు
  • పోలీసుల అదుపులో బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ని పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బంజారాహిల్స్ లో ఉన్న ఈ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం పేరు తెలంగాణ భవన్.
Telangana bhavan
Hyderabad

More Telugu News