ఇలాంటి చెత్త రాసినప్పుడు... నన్ను ట్యాగ్ చేయవద్దు: హీరో నాని

02-03-2018 Fri 16:32
  • నానికి యాక్షన్ సినిమాలపై ఆసక్తి పెరిగిందంటూ కథనం
  • సున్నితంగా రియాక్టైన నాని
  • ఇలాంటి కథనాలకు తనను ట్యాగ్ చేయవద్దన్న నాని
వరుసగా హిట్లతో దూసుకుపోతున్న హీరో నాని గురించి ఇటీవల ఓ మీడియా సంస్థ ఓ కథనాన్ని రాసింది. నానికి యాక్షన్ సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని, యాక్షన్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడని, కథలో యాక్షన్ సన్నివేశాలు ఉండేలా మార్పులు చేర్పులు చేయమని డైరెక్టర్ లతో చెబుతున్నాడనేది సదరు మీడియా చెప్పిన విషయం.

ఈ వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, దాన్ని నానికి కూడా ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్ చూసిన నాని సున్నితంగా స్పందించాడు. తాను చాలా గౌరవంతో చెబుతున్నానని... ఇలాంటి నాన్సెన్స్ రాసినప్పుడు, తనను ట్యాగ్ చేయకుండా ఉండాలని... ఇది తన విన్నపమని ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

ప్రస్తుతం నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీని తర్వాత నాగార్జునతో కలసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు.