sehwag: రంగులు మార్చేవాళ్లను చూసి మాత్రమే భయపడండి!: సెహ్వాగ్ 'హోలీ' ట్వీట్

  • దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య హోలీ 
  • సంబరాల్లో పాల్గొంటోన్న సెలబ్రిటీలు
  • రంగులు చూసి భయపడకండి- సెహ్వాగ్‌

దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు హోలీ పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. యువత ఎనలేని ఉత్సాహంతో రంగులు చల్లుకుంటూ ఆటపాటల్లో తేలియాడుతున్నారు. సెలబ్రిటీలు హోలీ పండుగలో పాల్గొని, రంగులతో నిండిపోయిన తమ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. తనదైన శైలిలో ఆసక్తికరంగా పోస్టులు చేస్తూ ట్విట్టర్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా హోలీ గురించి ట్వీట్ చేసి అలరించారు. 'రంగులు చూసి భయపడకండి.. రంగులు మార్చే వాళ్లను చూసి భయపడండి' అని పేర్కొని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.      

  • Loading...

More Telugu News