sridevi: శ్రీదేవి మరణంపై గూగుల్ సీఈవో స్పందన

  • శ్రీదేవి ఓ మార్గదర్శకురాలు
  • నాలాంటి ఎందరికో స్ఫూర్తి
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి ఓ మార్గదర్శకురాలని, తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఆమె మరణం తీరని లోటు అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తాను అభిమానించే శ్రీదేవి సినిమాల్లో 'సద్మ' ఒకటని... తన కుటుంబంతో కలసి చూసినప్పటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని చెప్పారు.

భార్యను కోల్పోయిన దు:ఖంలో అందరినీ ఉద్దేశించి బోనీ కపూర్ ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అందులో బోనీ ఆవేదన చూసి, అందరూ కదిలిపోయారు. ఈ నేపథ్యంలో, బోనీ లేఖకు రిప్లై ఇస్తూ, సుందర్ పిచాయ్ పై విధంగా స్పందించారు.
sridevi
sundar pichai

More Telugu News