ramya rao: మా బాబాయి కేసీఆర్ కు సినిమాల్లో నటించాలని వుండేది!: టీ-కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమ్యరావు

  • కేసీఆర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రమ్యరావు
  • మా కుటుంబంలో సినీ రంగానికి చెందిన వారెవరూ లేరు
  • ఓ ఇంటర్వ్యూలో టీ-కాంగ్రెస్ అధికారప్రతినిధి రమ్య రావు

తన బాబాయి కేసీఆర్ కు  సినిమాల్లో నటించాలనే కోరిక ఒకప్పుడు ఉండేదని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కేసీఆర్ అన్న కుమార్తె రమ్య రావు అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

ప్రశ్న : కేసీఆర్ గారు అప్పుడు అంత అందంగా ఉండేవారా?

రమ్య రావు : అందంగా ఉండే వాళ్లే సినిమాల్లో ఉండాలనేమీ లేదుగా! బ్రహ్మానందం, బాబుమోహన్, సునీల్ గారు..ఎంతో మంది సినిమాల్లో ఉన్నారు.

ప్రశ్న :  వీళ్లు అందంగా లేరా?

రమ్య రావు :  అందంగా ఉంటేనే సినిమాల్లోకి వెళ్లాలని మీరు అన్నారు కనుక చెబుతున్నాను. వీళ్లందరూ సక్సెస్ అయ్యారుగా

ప్రశ్న : అంటే.. కేసీఆర్ గారు హీరో రోల్ లో నటిద్దామనుకున్నారా? లేక విలన్ రోల్ లోనా?

రమ్య రావు :  దాని గురించి నాకు తెలియదు. మొత్తానికి సినీ రంగానికి వెళ్లాలనే కోరిక అయితే ఉండేది.  

ప్రశ్న : మీ కుటుంబంలో ఎవరైనా సినీ రంగంలో ఉన్నారా?

రమ్య రావు : మా కుటుంబంలో ఎవరూ లేరు.

ప్రశ్న :  సినీ రంగంలోకి వెళ్లాలనే ఆలోచన ఆయనకు ఎందుకొచ్చింది?

రమ్య రావు :  తెలుగు, సంస్కృత భాషలు, కళారంగానికి సంబంధించిన వాటిపై ఆయనకు ఆసక్తి ఉండేది.

ప్రశ్న : పౌరాణిక నాటకాలేమైనా కేసీఆర్ వేశారా?

రమ్య రావు : నాకు తెలియదు

  • Loading...

More Telugu News