AIMIM: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేకుండా చేస్తాం: అసదుద్దీన్‌ ఒవైసీ

  • హైదరాబాద్‌ దారుస్సలామ్‌లో ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీ వేడుకల్లో అసదుద్దీన్‌
  • మా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటాం
  • మా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హైదరాబాద్ ఎంపీ, ఎఐఎమ్‌ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ ఇరు పార్టీలను తెలంగాణలో లేకుండా చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని దారుస్సలామ్‌లో తమ పార్టీ నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ మాట్లాడుతూ... తమ పార్టీని తెలంగాణలో మరింత పటిష్టం చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటామని, తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News