secret camera: పక్కింటి బాత్ రూమ్ లో రహస్య కెమెరా అమర్చిన యువకుడు.. అరెస్ట్

  • బెంగళూరులోని బనశంకరిలో ఘటన
  • బాత్ రూమ్ లో రహస్య కెమెరా గుర్తించిన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

సభ్యసమాజం తలదించుకునేలా వికృత చేష్టలకు పాల్పడిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు బనశంకరి ప్రాంతంలోని మైకో లేఔట్ సార్వభౌమనగర్ లో ఉంటున్న జీవన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తన పక్కింట్లో ఉన్న బాత్ రూమ్ లో రహస్య కెమెరాను అమర్చాడు.

ఈ నేపథ్యంలో, బాత్ రూమ్ కు వెళ్లిన సదరు పక్కింటి మహిళ... అక్కడ కెమెరా ఉన్నట్టు గుర్తించింది. వెంటనే ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో, ఆయన పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు... ఈ పనికి పాల్పడింది జీవన్ అని గుర్తించి, కటకటాల వెనక్కి పంపారు. 

More Telugu News