Tollywood: నిలిచిన సినిమాల ప్రదర్శన... ఆగిన ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్... దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నడూ లేని స్థితి!

  • ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమకు గడ్డుకాలం
  • వీపీఎఫ్ తగ్గించేందుకు ససేమిరా అన్న డిజిటల్ సంస్థలు
  • చిత్రాల ప్రదర్శననే నిలిపి వేసిన నిర్మాతలు
  • నిలిచిన అడ్వాన్స్ బుకింగ్స్

దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ చిత్రాల ప్రదర్శన ఈ ఉదయం నుంచి నిలిచిపోయింది. వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజ్)ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న నిర్మాతలు క్యూబ్, యూఎఫ్ఓ వంటి డిజిటల్ సేవా సంస్థలు దిగిరాకపోవడంతో సినిమాలనే నిలిపివేయాలన్న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంగ్ల చిత్రాలకు ఎటువంటి వీపీఎఫ్ వసూలు చేయని సంస్థలు, ప్రాంతీయ చిత్రాలపై మాత్రం భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తుండటాన్ని దక్షిణాది నిర్మాతల మండలి తప్పుపడుతోంది.

ఇక సమ్మె అనివార్యమని తేలడంతో, పలు చిత్రాల ముందస్తు బుకింగ్స్ నిలిచిపోయాయి. బుక్ మై షో, ఈజీ మూవీస్, టికెట్ అడ్డా వంటి వెబ్ సైట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ను నిలిపివేశాయి. దీంతో ఇటీవల విడుదలైన స్కెచ్, అ, తొలిప్రేమ, ఛలో వంటి చిత్రాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇక తొలుత హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను ప్రదర్శించేందుకు ఓకే చెప్పిన నిర్మాతల మండలి, ఇప్పుడు వారితోనూ మాట్లాడగా, ఆ సినిమాలను కూడా ప్రదర్శించరాదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News